దళపతి కొత్త మూవీలో శివగామి.. ఏకంగా అలాంటి పాత్రలో! | Ramya Krishnan In Thalapathy Vijay 68th Movie | Sakshi
Sakshi News home page

Ramya Krishnan: విజయ్ 68వ సినిమాలో కీలకపాత్రలో రమ్యకృష్ణ

Dec 26 2023 8:31 AM | Updated on Dec 26 2023 8:31 AM

Ramya Krishnan In Thalapathy Vijay 68th Movie - Sakshi

దళపతి విజయ్‌ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.  వెంకట్‌ ప్రభు దర్శకుడు. విజయ్‌.. తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ క్రేజీ చిత్రాన్ని ఏజీఎస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రంలో భారీ తారాగణమే నటిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, యోగిబాబు, కిచ్చా సుదీప్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తుండగా.. ఇప్పుడు మరో ప్రముఖ నటి కూడా జాయిన్ అయింది. 

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే)

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ.. 'బాహుబలి'లో శివగామిగా చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పుడు విజయ్ కొత్త మూవీలో నటిస్తున్న స్వయంగా ఆమెనే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. యువన్ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ చైన్నెలో ప్రారంభమై థాయిలాండ్‌, టర్కీ, హైదరాబాద్‌‌లో జరిగింది. తదుపరి షెడ్యూల్‌ క్రిస్మస్‌ తర్వాత అంటే జనవరి తొలివారంలో ప్రారంభం కానుందని సమాచారం.

(ఇదీ చదవండి: మెగా క్రిస్మస్ సెలబ్రేషన్స్.. ఒక్కటిగా కనిపించిన ఆ ఇద్దరు!)

Advertisement
 
Advertisement
Advertisement