ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే | Payal Rajput Mangalavaaram Movie Streaming In This OTT, Check Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Mangalavaaram Movie OTT Release: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ అయిపోతున్న రీసెంట్ హిట్ మూవీ

Published Tue, Dec 26 2023 7:09 AM

Mangalavaaram Movie OTT Streaming In Hotstar Payal Rajput - Sakshi

సాధారణంగా కొత్త మూవీస్ ఏ శుక్రవారమో శనివారమో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటాయి. కొన్నికొన్నిసార్లు మాత్రం డిఫరెంట్‌గా వారం మధ్యలో విడుదల చేస్తుంటారు. అలా ఇప్పుడు ఓ తెలుగు హిట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అయిపోతుంది. అదే 'మంగళవారం'. పాయల్ రాజ్‌పుత్- అజయ్ భూపతి కాంబో.. ఈ మూవీతో మరో క్రేజీ హిట్ అందుకున్నాడు.

హిట్ సినిమా
'ఆర్ఎక్స్ 100' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి.. ఆ తర్వాత 'మహాసముద్రం'తో ఘోరమైన ఫ్లాప్ అందుకున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని 'మంగళవారం' మూవీ తీశారు. తనకు అచొచ్చిన పాయల్ రాజ్‌పుత్ ఇందులో హీరోయిన్‌గా చేసింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీకి తోడు హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో మూవీ హిట్ అయిపోయింది.

(ఇదీ చదవండి: బాలీవుడ్ మరో స్కామ్ బండారం బయటపెట్టిన 'యానిమల్' నిర్మాత)

ఆ ఓటీటీలోనే
అయితే థియేటర్లలో 'మంగళవారం' సినిమా.. నవంబరు 17న రిలీజ్ చేశారు. కానీ అదే టైంలో క్రికెట్ వరల్డ్‌కప్ ఫైనల్ ఉండటంతో దీన‍్ని జనాలు సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి ఈ చిత్రం వచ్చేసింది. కాబట్టి ఎంచక్కా ఇంట్లోనే చూసేయొచ్చు. థియేటర్లలో ఈ మూవీని శుక్రవారం రిలీజ్ చేశారు గానీ ఓటీటీలో మాత్రం మంగళవారమే రిలీజ్ చేశారండోయ్. తెలుగుతో పాటు దక్షిణాదిలోని అన్ని భాషల్లో 'మంగళవారం' స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఈ మూవీలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకండి!

కథేంటి?
1996లో ఆంధ్రాలోని ఓ పల్లెటూరు. ఊ‍ళ్లో ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని ఎవరో గోడ మీద రాస్తారు. తర్వాతి రోజే ఆ ఇద్దరూ చనిపోయింటారు. పరువు పోవడంతో హత్య చేసుకున్నారని ఊరి జనం అనుకుంటారు. పోలీసులకు మాత్రం ఇవి హత్యలని అనుమానం. అలానే మరో మంగళవారం... ఇలానే గోడ మీద అక్రమ సంబంధం అని పేర్లు రాసిన తర్వాత మరో ఇద్దరు చనిపోతారు. ఇంతకీ గోడ మీద పేర్లు రాస్తున్నది ఎవరు? ఈ హత్యలతో శైలు (పాయల్ రాజ్‌పుత్)కి సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే 'మంగళవారం' స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

Advertisement
 
Advertisement
 
Advertisement