
‘రామ... రామ..’ అంటూ యూట్యూబ్ వీక్షకులను చిరంజీవి అలరిస్తున్నారు. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ అడ్వెంచరస్ మూవీ ‘విశ్వంభర’. ఈ చిత్రంలో త్రిషా కృష్ణన్, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘విశ్వంభర’లోని ‘జై శ్రీరామ్... జై శ్రీరామ్... రామ... రామ... రామ..’ అంటూ సాగేపాట లిరికల్ వీడియోను ఏప్రిల్‌లో విడుదల చేశారు మేకర్స్.
ఈపాట యూట్యూబ్ మ్యూజిక్‌లో 25+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, శ్రోతలను బాగా ఆకట్టుకుందని చిత్రబృందం పేర్కొంది. ‘‘జై శ్రీ రామ్’ అనే నినాదాన్ని ప్రతిధ్వనించే ఈ సాంగ్ మ్యూజిక్ సెన్సేషన్‌గా మారి, చార్ట్ బస్టర్‌గా నిలిచింది. చిరంజీవిగారి డ్యాన్స్ గ్రేస్, ఆస్కార్ విన్నర్ కీరవాణిగారి మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రిగారి లిరిక్స్, భారీ సెట్... ఇలా ఈపాట అన్ని విధాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోంది. మున్ముందు ఈపాట మరింత పెద్ద హిట్ అవుతుందని ఊహిస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది.