పవన్ కల్యాణ్‌ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! | Ram Gopal Varma Tweet On Pawan Kalyan OG Glimpse Release | Sakshi
Sakshi News home page

'చంపేశావ్ బ్రో'.. పవన్ కల్యాణ్‌ ఓజీపై రాంగోపాల్ వర్మ ట్వీట్ వైరల్!

Sep 2 2023 3:02 PM | Updated on Sep 2 2023 3:25 PM

Ram Gopal Varma Tweet On Pawan Kalyan OG Glimpse Release - Sakshi

సాహో తర్వాత దర్శకుడు సుజిత్‌ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ(OG). పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌. పవన్ బర్త్‌ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్ చూస్తే ఫుల్‌ యాక్షన్‌లో మోడ్‌లో గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్ అద్భుతంగా ఉందంటూ పలువురు ట్వీట్స్ చేస్తున్నారు. హంగ్రీ చీతా అనే పేరుతో వచ్చిన ఓజీ గ్లింప్స్ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్ చేశారు.   

(ఇది చదవండి: ఘట్టమనేని కుటుంబంలో పెళ్లి సందడి.. ఫోటోలు షేర్‌ చేసిన రోజా)

పవన్ కల్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెబుతూ ఆర్జీవీ చేసిన ట్వీట్ చేశారు. 'ఓజీ గ్లింప్స్ ప్రపంచాన్ని దాటేసింది.. నేను ఇప్పటి వరకు చూసిన పీకే ట్రైలర్స్‌లో ఇది అత్యుత్తమం. హే సుజిత్ మీరు చంపేశారు బ్రో అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.  ఇది చూసిన పవన్ కల్యాణ్ అభిమానులు సైతం క్రేజీ పోస్టులు పెడుతున్నారు. ఇది చూసిన కొందరు నెటిజన్స్ ఊహించని ట్వీట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఫ్యాన్స్ మాత్రం ఓజీ గ్లింప్స్ ఆ రేంజ్‍లో అద్భుతంగా ఉందని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

అర్జున్ దాస్ ఓయిస్ ఓవ‌ర్ తో గ్లింప్ల్ మొద‌లైంది. ప‌దేళ్ల క్రితం బాంబేలో వ‌చ్చిన తుపాను గుర్తుందా? అది మ‌ట్టి, చెట్ల‌తో పాటు, స‌గం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు న‌రికిన మ‌నుషుల ర‌క్తాన్ని మాత్రం ఇప్ప‌టికీ ఏ తుఫాను క‌డ‌గ‌లేక‌పోయింది. అలాంటి వాడు మ‌ళ్లీ తిరిగి వ‌స్తున్నాడు అంటే..’ అంటూ పవన్‌ ఎంట్రీని చూపించారు. తమన్‌ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి మరింత బలాన్ని చేకూర్చింది. 

(ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్‌ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్‌)

కాగా.. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తోంది.  విలన్ పాత్రను బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement