25 ఇస్తే పావలాకి పావలా సీట్లు అంటారు.. ఆర్జీవీ సెటైర్లు | Sakshi
Sakshi News home page

అందుకే జనసేనకు 24 సీట్లు.. ఆర్జీవీ సెటైర్లు

Published Sat, Feb 24 2024 4:00 PM

Ram Gopal Varma Respond On TDP Janasena First List - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో​ టీడీపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. శనివారం టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితాను చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రకటించారు.  పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు.. మూడు లోక్‌ సభ స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబు వెల్లడించాడు.
 
పవన్‌పై విమర్శలు
పొత్తులో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంపై సోషల్‌ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జనసేన లేకుంటే టీడీపీ గెలవదంటూ గతంలో చెప్పిన పవన్‌  కల్యాణ్‌.. ఇప్పుడు 24 అసెంబ్లీ, 3 లోక్‌ సభ స్థానాలతో సరిపెట్టుకోవడం అంటే జనసేన కార్యకర్తలను అవమానించినట్లేనని విమర్శింస్తున్నారు.

పదేళ్ల చరిత్ర ఉన్న పార్టీ..గత ఎన్నికల్లో 130 స్థానాల్లో పోటీ చేసిన పార్టీ..ఇప్పుడు కేవలం 24 స్థానాలకే పరిమితం అయిందంటే.. చంద్రబాబు ట్రాప్‌లో పవన్‌ పడ్డాడని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. ఇక వైఎస్సార్‌సీపీ నేతలు సైతం జనసేన అధినేతపై సైటైర్లు వేస్తున్నారు.  ‘24 మందితో వైఎస్సార్‌సీపీ మీద పవన్‌ యుద్ధం చేస్తారా?’, కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థితిలో పవన్‌ కల్యాణ్‌ ఉన్నాడు. అతన్ని చూస్తే జాలేస్తోందంటూ’ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ ఎద్దేశా చేశాడు. 

అందుకే 24 సీట్లు.. ఆర్జీవీ సెటైర్లు
జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్‌ సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తనదైన శైలీలో స్పందించాడు. ట్రోల్‌ చేస్తారనే భయంతోనే 24 సీట్లు కేటాయించారంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ‘23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారు అని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 స్థానాలు ఇచ్చారు’ అని ఆర్జీవీ సెటైర్లు వేశాడు. 

Advertisement
 
Advertisement