
బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఈసారి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ (Akkada Ammayi Ikkada Abbayi Movie)తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ స్పీడు పెంచింది. తాజాగా ఈ మూవీకి సపోర్ట్ చేసేందుకు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ముందుకు వచ్చాడు.
గ్లోబల్ స్టార్‌కు ఫస్ట్ టికెట్
ఇందుకు సంబంధించిన ఓ సరదా వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది. అందులో ప్రదీప్.. ఫస్ట్ డే మార్నింగ్ షో.. ఫస్ట్ టిక్కెట్టు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ (Ram Charan)కు ఇవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అది విన్న సత్య.. రామ్‌చరణ్ తనకు చాలా క్లోజ్.. నేను ఏది చెప్తే అంత అంటూ బిల్డప్ కొట్టాడు.

చివర్లో మాత్రం..
చివరకు చరణ్ ఎంట్రీ ఇచ్చి సత్యను చూసి ఎవరీ అబ్బాయి అనడంతో అతడి పరువు పోయినట్లయింది. చివర్లో మాత్రం సత్యను గుర్తుపట్టి పెద్ది షూటింగ్‌కు సమయానికి వచ్చేయ్ అన్నాడు. అనంతరం సత్య.. చెర్రీ కాళ్లు మొక్కగా అతడు కూడా తిరిగి పాదాలకు నమస్కరించడం విశేషం. తర్వాత చరణ్.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ఫస్ట్ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇది చూసిన అభిమానులు అంత పెద్ద స్టార్ అయ్యుండి ఇంత సింపుల్‌గా ఉండటం చాలా గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: సందీప్ వంగాతో వివాదం.. తండ్రి తిట్టాడనే అనుకున్నా: రధన్