Ram Charan : రామ్‌చరణ్‌ కోసం బర్త్‌డే పార్టీ నిర్వహించిన తారక్‌

Ram Charan Birthday Celebrations Hosted by Jr NTR - Sakshi

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేనియా నడుస్తుంది. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, జూ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తుంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న రామ్‌చరణ్‌కి ఆర్‌ఆర్‌ఆర్‌ బెస్ట్‌ బర్త్‌డే గిఫ్ట్‌ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆదివారం(మార్చి27)న రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో పాటు సెలబ్రిటీల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా చరణ్‌కి తారక్‌ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

తన ఇంట్లో చెర్రీ కోసం గ్రాండ్‌గా బర్త్‌డే పార్టీని నిర్వహించాడు. ఈ వేడుకకి రాజమౌళి, అఖిల్‌ అక్కినేనితో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం ఉన్న సంగతి తెలిసిందే. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top