RC15 : రామ్‌చరణ్‌కు భార్యగా అంజలి.. లీకైన ఫోటోలు

Ram Charan Anjali As Wife And Husband For RC15 Pics Leaked - Sakshi

ఫ్లాష్‌బ్యాక్‌ మోడ్‌లో ఉన్నారట రామ్‌చరణ్‌. శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి, జయరామ్‌, ఎస్‌జే సూర్య, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌, అంజలిపై కీలక సన్నివేశాలను తీస్తున్నారని తెలిసింది.

ఈ షెడ్యూల్‌ మరో వారం పాటు అ‍క్కడి లొకేషన్స్‌లోనే సాగుతుందట. అయితే ప్రస్తుతం చిత్రీకరిస్తున్న సన్నివేశాలు సినిమాలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో వస్తాయని, 1930 కాలం నేపథ్యంలో ఈ సీన్స్‌లో రామ్‌చరణ్‌, అంజలి భార్యభర్తలుగా కనిపిస్తారనే ప్రచారం వినిపోస్తోంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట లీక్‌ అయ్యాయి. 

అంతేకాదు. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారని టాక్‌. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారని సమాచారం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top