శంకర్‌- రామ్‌చరణ్‌ సినిమా; పది కోట్ల పాట? | Ram Charan And Shankar Movie Song Budget details | Sakshi
Sakshi News home page

శంకర్‌- రామ్‌చరణ్‌ సినిమా; పది కోట్ల పాట?

Nov 17 2022 1:45 AM | Updated on Nov 17 2022 3:01 PM

Ram Charan And Shankar Movie Song Budget details - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ రూపొందుతున్న సినిమా కోసమే శంకర్‌ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్‌ చేశారట.

దర్శకుడు శంకర్‌ సినిమాల్లో సాంగ్స్‌ విజువల్స్‌ పరంగా, లొకేషన్స్‌ పరంగా చాలా గ్రాండియర్‌గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్‌ మరో గ్రాండియర్‌ సాంగ్‌ను తీసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే శంకర్‌ పది కోట్ల బడ్జెట్‌తో పాట ప్లాన్‌ చేశారట. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ షూటింగ్‌ న్యూజిల్యాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ షెడ్యూల్‌ ఈ నెల 20 నుంచి డిసెంబరు 2 వరకు జరుగుతుందట. హీరో రామ్‌చరణ్, హీరోయిన్‌ కియారా అద్వానీలపై గ్రాండ్‌గా డ్యూయట్‌ సాంగ్‌ చిత్రీకరించనున్నారని సమాచారం. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ పాటకు దాదాపు పదికోట్ల రూపాయలకు పైనే బడ్జెట్‌ను కేటాయించారట. బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ బాస్కో మార్టిస్‌ ఈ పాటకు నృత్యరీతులు సమకూర్చుతారని సమాచారం.

పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతదర్శకుడు. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది చివర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement