Rakul Preet Singh Says She Want To Do Challenging Roles - Sakshi
Sakshi News home page

సక్సెస్‌ లేని రకుల్‌.. మాస్‌ మసాలా పాత్రల కోసం వెయిటింగ్‌..

Apr 26 2023 6:51 AM | Updated on Apr 26 2023 9:30 AM

Rakul Preet Singh Says She Want to do Challenging Roles - Sakshi

తమిళంలో సక్సెస్‌ అన్నది ఎండమావులుగానే మారింది. ప్రస్తుతం కమలహాసన్‌ సరసన ఇండియన్‌ 2 చిత్రంతో పాటు శివ కార్తికేయన్‌కు జంటగా అయిలాన్‌ చిత్రంలో నటిస్తోంది.

మాస్‌ మసాలా కథా పాత్రల కోసం వెయింటింగ్‌ అంటోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో స్టార్‌ హీరోలతో జతకట్టి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలు తన ఖాతాలో వేసుకుందీ బ్యూటీ. అదే విధంగా బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాల్లోనూ నటించినా సరైనా విజయాలను అందుకోలేకపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా తమిళంలో ఆరంభం నుంచి సక్సెస్‌ కోసం పోరాడుతూనే ఉంది. కార్తీ సరసన నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంతో మాత్రమే ఇక్కడ విజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత ఈమెకు తమిళంలో సక్సెస్‌ అన్నది ఎండమావులుగానే మారింది. ప్రస్తుతం కమలహాసన్‌ సరసన ఇండియన్‌ 2 చిత్రంతో పాటు శివ కార్తికేయన్‌కు జంటగా అయిలాన్‌ చిత్రంలో నటిస్తోంది.

వీటిలో అయిలాన్‌ చిత్రం దీపావళికి తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఓ భేటీలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను కథలను ఎంపిక చేసుకోవడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. వైవిధ్యభరిత కథల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. అదే సమయంలో మాస్‌ మసాలా కథాంశం కలిగిన చిత్రాల్లోనూ నటించాలని కోరుకుంటున్నాననంది. తనలోని నటన ప్రతిభను చాటుకోవడానికి ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement