Rakhi Sawant: నా ప్రైవేట్ వీడియోలు అమ్ముకున్నాడు.. భర్తపై నటి సంచలన ఆరోపణలు

Rakhi Sawant Sensational Allegations On Her Husband Adil Durrani - Sakshi

బాలీవుడ్‌ నటి, బిగ్‌బాస్‌ ఫేం రాఖీ సావంత్‌ తన రెండో భర్త అదిల్‌ దురానీపై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.  అదిల్‌ కట్నం గురించి తనను వేధించాడని, తన ఇమేజ్‌ని వాడుకొని స్టార్‌డమ్‌ పొందాడని ఆరోపించింది.

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘శృంగారం విషయంలో అదిల్‌ నన్ను చాలా రకాలుగా హింసించాడు. నా ప్రైవేట్ వీడియోలు కొంతమందికి అమ్ముకున్నాడు.  ఆ కేసు ప్రస్తుతం సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. చందేల్‌ అనే యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాడు’ అని రాఖీ సావంత్‌ ఆరోపించింది.

అలాగే తన దగ్గర రూ.1.50 కోట్లు తీసుకొని ఇవ్వడం లేదంటూ.. అతను తీసుకున్నట్లు అంగీకరించిన ఓ పాత వీడియోని షేర్‌ చేసింది. కాగా, తన భర్త చిత్ర హింసలు పెడుతున్నాడని రాఖీ సావంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ముంబై పోలీసులు అదిల్‌ దురానీని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top