Rakhi Sawant Open Up on She Underwent Breast Surgery at the Age of 15, Details Inside - Sakshi
Sakshi News home page

Rakhi Sawant : 'బ్రెస్ట్‌ సర్జరీ.. అదొక భయంకరమైన ఎక్సీపిరియన్స్‌'

Mar 8 2022 4:35 PM | Updated on Mar 8 2022 8:52 PM

Rakhi Sawant Reveals She Underwent Breast Surgery At the Age of 15 - Sakshi

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ రాఖీ సావంత్‌ బిగ్‌బాస్‌లో పొల్గొని మరింత పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇది వరకు కేవలం కాంట్రవర్సీ క్వీన్‌గానే గుర్తింపు పొందిన రాఖీ బిగ్‌బాస్‌ అనంతరం మోస్ట్‌ ఎంటర్‌టైనర్‌గా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకుంది. అయితే ఈ ప్రయాణం అంత సులవైంది కాదని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. 

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో పాట్లు పడ్డాను. 15-16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బ్రెస్ట్‌ సర్జరీ చేయించుకున్నాను. అది నన్ను ఎంతో భయపెట్టింది. బాలీవుడ్‌లో చోటు సంపాదించాలని కలలు కన్నాను. ఆ సమయంలో మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌లు సైతం సర్జరీలు చేయించుకుంటున్నారు.

బాలీవుడ్‌లో అవకాశాలు రావాలంటే ముఖం, శరీరం చక్కని ఆకృతిలో ఉండాలని చెప్పారు. ఈ సమయంలో నేను సరైన రీతిలో లేను. దీంతో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది అని రాఖీ చెప్పుకొచ్చింది. కాగా రాఖీ బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌తో పాటు లైపో సక్షన్‌ వంటి ప్రయత్నాలు చేసి హాట్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. 


 

Advertisement
 
Advertisement
Advertisement