చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు: నిర్మాత రాకేశ్‌ వర్రే | Rakesh Varre Interesting Comments About Pekamedalu Movie At Success Meet, Deets Inside | Sakshi
Sakshi News home page

చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు: నిర్మాత రాకేశ్‌ వర్రే

Jul 20 2024 5:49 PM | Updated on Jul 20 2024 6:23 PM

Rakesh Varre Talk About Pekamedalu Movie At Success Meet

మంచి కంటెంట్‌తో మూవీ తీస్తే చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు కచ్చితంగా  థియేటర్‌ వస్తారని ‘పేక మేడలు’ మరోసారి నిరూపించిందని అన్నారు నిర్మాత రాకేశ్‌ వర్రే. వినోద్‌ కిషన్‌, అనూష కృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకత్వం వహించారు. జులై 19న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ సంపాదించుకుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో నిర్మాత రాకేశ్‌ వర్రే మాట్లాడుతూ.. ‘దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది.

 ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్‌కు  వస్తారు’ అన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు ’అని అన్నారు దర్శకుడు నీలగిరి మామిళ్ల. 

Advertisement
 
Advertisement
Advertisement