ఆ డైరెక్ట‌ర్‌ నన్ను ఏడిపించాడు: రజనీకాంత్‌ | Rajinikanth Says Started Crying Director Siva Narrated Annaatthe Movie Script | Sakshi
Sakshi News home page

Rajinikanth: ఆ డైరెక్ట‌ర్‌ నన్ను ఏడిపించాడు: రజనీకాంత్‌

Nov 16 2021 6:58 PM | Updated on Nov 16 2021 8:01 PM

Rajinikanth Says Started Crying Director Siva Narrated Annaatthe Movie Script - Sakshi

Rajinikanth Tears: త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రం అన్నాత్తే దీపావళి కానుకగా విడుదలైంది. తెలుగులో ‘పెద్ద‌న్న‌’గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చి మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ త‌మిళ్‌లో మాత్రం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇటీవల హూట్ యాప్ ఇంటర్యూలో రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను సూపర్‌ స్టార్‌ షేర్‌ చేశారు. 

‘విశ్వాసం’ సినిమా చూసిన తర్వాత నిర్మాత త్యాగరాజన్‌ని అభినందించి, శివతో మాట్లాడాల‌ని ఆస‌క్తిగా ఉంద‌ని చెప్పానన్నారు రజనీ. ఈ క్రమంలో తనతో సినిమా చేయాలని ఉందని శివతో చెప్పడంట రజనీ. తనతో సినిమా అనగానే శివ.. సార్‌ మీతో హిట్ సినిమా తీయ‌డం చాలా సులభమని చెప్పినట్లు తలైవా చెప్పుకొచ్చాడు.

15 రోజుల్లో పల్లెటూరు నేపథ్యంలోని స్క్రిప్ట్‌తో రావాలని రజనీకాంత్ అడగగా, శివ 12 రోజుల్లోనే పూర్తి చేసి తనకి కనిపించినట్లు చెప్పారు. తనకు కథ చెప్పడానికి రెండు గంట‌ల‌కుపైగా పట్టిందని, ఆ క‌థ విన్న త‌ర్వాత తనకు క‌న్నీళ్లు వ‌చ్చాయని చెప్పుకొచ్చారు ర‌జనీకాంత్. అలా ‘అన్నాత్తే’ సినిమా సెట్స్‌పైకి వెళ్లినట్లు చెప్పారు. కాగా డైరెక్ట‌ర్ శివ తొలిసారి ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేశాడు. 

చదవండి: Kajal Aggarwal: భర్త కోసం అలాంటి కండీషన్లు పెడుతున్న కాజల్‌

Advertisement
 
Advertisement
Advertisement