Rajinikanth 170 Film Release Announced - Sakshi
Sakshi News home page

ఈతరం హీరోలను మించిపోతున్న రజనీకాంత్‌

Jun 27 2023 9:08 AM | Updated on Jun 27 2023 12:44 PM

Rajinikanth 170 Film Release Announced - Sakshi

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల తన చిత్రాల వేగాన్ని పెంచుతున్నారు. గ్యాప్‌ లేకుండా చిత్రాలు చేస్తూ ఈతరం హీరలను మించిపోతున్నారు. ఏడుపదుల వయసులోనూ అవిశ్రాంతిగా నటిస్తున్న రజనీకాంత్‌ను చూసి సినీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే జైలర్‌ చిత్రంలో నటించారు. దీన్ని సన్‌ పిచ్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించారు. నెల్సన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో జైలర్‌గా నటిస్తున్న రజినీకాంత్‌ రెండు గెటప్పుల్లో కనిపిస్తారా? లేక రెండు పాత్రల్లోనా అన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. ఆగస్టు 10వ తేదీన జైలర్‌ చిత్రం తెరపైకి రానుంది.

(ఇదీ చదవండి: Drugs Case: ఆషూ రెడ్డి వీడియో విడుదల)

ప్రస్తుతం రజనీకాంత్‌ తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటిస్తున్న లాల్‌ సలాం చిత్రం షూటింగ్‌ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రంలో రజనీకాంత్‌కు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ పుదుచ్చేరిలో జరుగుతోంది. దీంతో రజినీకాంత్‌ తన 170వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.

(ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్‌.. నటుడిపై ట్రోల్స్‌)

జైభీమ్‌ చిత్రం టీజే.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. బోగస్‌ ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా సాగే ఈ చిత్రంలో రజనీకాంత్‌ పోలీస్‌ అధికారిగా నటించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ జూలైలో ప్రారంభం కాబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చిత్రం తర్వాత రజనీకాంత్‌ తన 171వ చిత్రాన్ని లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement