
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): నగరంలో రాజరాజ చోర చిత్ర నటీనటులు సందడి చేశారు. ఆదివారం ఉదయం చిత్ర యూనిట్ సభ్యులు సింహాచలం వరాహలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం సంగం, శరత్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి ఆడిపాడారు. చిత్ర బృందం ఆకస్మాత్తుగా థియేటర్‌లో ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. వారితో సెల్ఫీలు దిగారు.
ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ విశాఖ నగరం అంటే తనకు ఎంతో ఇష్టమని, ఇదే సంగం, శరత్ థియేటర్‌లో గతంలో ఠాగూర్, అతడు వంటి చిత్రాలను ప్రేక్షకుడిగా చూశానని తెలిపారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు హసిత్ గోలి మాట్లాడుతూ మా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని, త్వరలో మాస్ ప్రేక్షకులకు మరింతగా దగ్గరయ్యే సినిమాలు చేస్తానని తెలిపారు.
చదవండి : వైరల్ :రూబిక్స్ క్యూబ్‌తో చిరంజీవి పిక్చర్
పశుపతి హీరోగా మరో సినిమా.. షూటింగ్ ప్రారంభం