గ్రాండ్‌గా దివంగ‌త సింగ‌ర్ కూతురి పెళ్లి | Radhika Thilak Daughter Devika Suresh Married to Advocate Aravindan | Sakshi
Sakshi News home page

అడ్వ‌కేట్‌ను పెళ్లాడిన దివంగ‌త గాయ‌ని కూతురు

Feb 23 2024 11:40 AM | Updated on Feb 23 2024 11:52 AM

Radhika Thilak Daughter Devika Suresh Married to Advocate Aravindan - Sakshi

దివంగ‌త మ‌ల‌యాళ టాప్ సింగ‌ర్ రాధిక తిల‌క్ కూతురు దేవిక సురేశ్‌ పెళ్లిపీట‌లెక్కింది. అడ్వ‌కేట్ అర‌విందన్ సుచింద్ర‌న్‌ను పెళ్లాడింది. ఇరు కుటుంబాలు, బంధుమిత్రుల స‌మ‌క్షంలో బెంగ‌ళూరులో ఫిబ్ర‌వ‌రి 19న‌ వీరి వివాహం ఘ‌నంగా జ‌రిగింది. ఈ పెళ్లి వేడుక‌లో రాధిక క‌జిన్‌, సింగ‌ర్ సుజాత మోహ‌న్ త‌న కుటుంబంతో క‌లిసి సంద‌డి చేసింది.

దేవిక పెళ్లి ఫోటోల‌సు సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ కొత్త జంట‌ను ఆశీర్వ‌దించ‌మ‌ని అభిమానుల‌ను కోరింది. ఫిబ్ర‌వ‌రి 25న కొచ్చిలో గ్రాండ్ రిసెప్ష‌న్ ఏర్పాటు చేయ‌నున‌ట్లు వ‌ధువు తండ్రి సురేశ్ వెల్ల‌డించాడు. కాగా రాధిక త‌న అద్భుత గాత్రంతో దాదాపు 70 పాట‌లు పాడింది. సినిమా పాట‌లే కాకుండా 200 భ‌క్తిగీతాలు ఆల‌పించింది. టీవీ యాంక‌ర్‌గానూ రాణించింది.

కానీ క్యాన్స‌ర్ మ‌హ‌మ్మారి ఆమెను బ‌లి తీసుకుంది. 45 ఏళ్ల వ‌య‌సులో క్యాన్స్‌తో పోరాడుతూ క‌న్నుమూసింది. 2015లో ఆమె మ‌ర‌ణించినా త గొంతు మాత్రం ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంది. త‌ల్లి బాట‌లోనే కూతురు కూడా పాట‌లు పాడుతూ ఆ వీడియోల‌ను నెట్టింట అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది.

చ‌ద‌వండి: షణ్ముఖ్‌ కేసులో జరిగింది ఇదే.. అరెస్ట్‌కు అసలు కారణం చెప్పిన దిలీప్‌ సుంకర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement