లైంగిక దాడులపై రాయ్‌ లక్ష్మీ పోరాటం! | Raai Laxmi Starrer Janatha Bar Movie Update | Sakshi
Sakshi News home page

Raai Laxmi: లైంగిక దాడులపై రాయ్‌ లక్ష్మీ పోరాటం!

Jan 2 2022 7:41 AM | Updated on Jan 2 2022 7:41 AM

Raai Laxmi Starrer Janatha Bar Movie Update - Sakshi

స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్‌ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక దాడులపై పోరాడిన..

స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ స్పోర్ట్స్‌ ఉన్నతాధికారులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న లైంగిక దాడులపై పోరాడిన ఓ మహిళ కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘జనతా బార్‌’. రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో రమణ మొగిలి దర్శకత్వంలో అశ్వర్థ నారాయణ సమర్పణలో రోచిశ్రీ మూవీస్‌ నిర్మిస్తున్న చిత్రం ఇది.

రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా రమణ మొగిలి మాట్లాడుతూ – ‘‘రాయ్‌ లక్ష్మీ పాత్ర హైలైట్‌గా వుంటుంది. అలాగే హిందీ నటుడు శక్తి కపూర్‌ పాత్ర మరో హైలైట్‌’’ అన్నారు. ఈ చిత్రానికి కథ–మాటలు–స్క్రీన్‌ప్లే: రాజేంద్ర భరద్వాజ్, సంగీతం: వినోద్‌ యజమాన్య, సహనిర్మాత: అజయ్‌ గౌతమ్‌.

Advertisement
 
Advertisement
Advertisement