పుష్ప ప్లాన్‌ మారింది | Pushpa Shooting shifted to kerala | Sakshi
Sakshi News home page

పుష్ప ప్లాన్‌ మారింది

Sep 13 2020 2:57 AM | Updated on Sep 13 2020 5:15 AM

Pushpa Shooting shifted to kerala - Sakshi

ప్రస్తుతం ఉన్న అనిశ్చితిలో అనుకున్న పనులు అనుకూలంగా సాగుతాయని కచ్చితంగా చెప్పలేం. ముఖ్యంగా సినిమా చిత్రీకరణల ప్లాన్‌లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. తాజాగా ‘పుష్ప’ సినిమా షూటింగ్‌ ప్లాన్‌ మారిందని సమాచారం. అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య, ఆర్య 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మికా మందన్నా కథానాయిక. ఈ సినిమా కథాంశం ఎర్రచందనం నేపథ్యంలో సాగుతుంది.

దాంతో చిత్రీకరణను  ఎక్కువ శాతం అడవుల్లో జరపనున్నారు. ముందుగా కేరళ అడవుల్లో సినిమాను షూట్‌ చేయాలనుకున్నారు. కోవిడ్‌ వల్ల తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న అటవీ ప్రాంతంలో అక్టోబర్‌ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు. తాజాగా మళ్లీ కేరళకే షూటింగ్‌ను షిఫ్ట్‌ చేయాలనుకుంటున్నారట చిత్రబృందం. అందుకే ముందు అనుకున్నట్టుగా అక్టోబర్‌ కాకుండా డిసెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తారట. మొదటి షెడ్యూల్‌లో దాదాపు 40 శాతం వరకూ షూటింగ్‌ పూర్తయిందని తెలిసింది. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement