Pushpa First Day Collections: రికార్డు క్రియేట్‌ చేసిన 'పుష్ప' బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌

Pushpa Movie First Day Box Office Collections - Sakshi

Pushpa Movie First Day Box Office Collections: అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్‌17)న విడుదలైన ఈ చిత్రం రిమార్కబుల్‌ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపుతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.

ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని మేకర్స్‌ తెలిపారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్‌-2కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్‌'(Pushpa: The rule)టైటిల్‌తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top