మాస్‌ జాతర | Pushpa Movie Action Sequence shooting at Hyderabad | Sakshi
Sakshi News home page

మాస్‌ జాతర

Published Thu, Nov 9 2023 4:51 AM | Last Updated on Thu, Nov 9 2023 4:51 AM

Pushpa Movie Action Sequence shooting at Hyderabad - Sakshi

జాతరలో మాస్‌ ఫైట్‌ చేస్తున్నారు పుష్పరాజ్‌. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పుష్ప’. ఈ చిత్రం తొలి భాగం ‘పుష్ప: ది రైజ్‌’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘పుష్ప’ మలిభాగం ‘పుష్ప: ది రూల్‌’ సినిమా షూట్‌తో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్, సుకుమార్‌. ఈ చిత్రంలో పుష్పరాజ్‌ ΄ాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్‌. ప్రజెంట్‌ ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో జరుగుతోంది.

జాతర నేపథ్యంలో వచ్చే ఓ ΄ాట, ఆ జాతరకు ముడిపడి ఉన్న ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ జాతర బ్యాక్‌డ్రాప్‌ సీన్స్‌ అన్నీ ఇంట్రవెల్‌ సమయంలో రానున్నాయని భోగట్టా. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ, సునీల్‌ కీలక ΄ాత్రలు ΄ోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement