గుండెపోటుతో మహిళా నిర్మాత మృతి

Producer RP Purani Died With Heart Attack - Sakshi

సాక్షి, చెన్నై: కరోనా మహమ్మారికి తోడు గుండెపోటు, అనారోగ్య కారణాలతో పలువురు సినీ ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా మహిళా నిర్మాత ఆర్పీ పూరణి(62) గుండెపోటుతో మంగళవారం కన్నుమూశారు. ఆమె భర్త జి.రామచంద్రన్‌తో కలిసి  జీఆర్‌ గోల్డ్‌ ఫిలింమ్స్‌ పతాకంపై సౌండ్‌ పార్టీ, మనునీది, కాసు ఇరుక్కున్న, ఎంగ రాశి నల్లరాశి, కాదలి కానవిళ్‌లై వంటి చిత్రాలను నిర్మించారు.

పూనమల్లి, వేలప్పన్‌ చావడిలో నివసిస్తున్న పూరణి మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గుండెపోటుతో మృతిచెందారు. ఈమె మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మాంగాడులోని ఆమె ఫాం హౌస్‌లో మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.

చదవండి: కోలివుడ్‌ను కుదిపేస్తున్న కరోనా: దర్శకుడి భార్య మృతి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top