అనుకున్నది సాధించాం: రమణా రెడ్డి సోమ | Producer Madhavi Reddy Soma about AmeerLog | Sakshi
Sakshi News home page

అనుకున్నది సాధించాం: రమణా రెడ్డి సోమ

Aug 21 2026 3:52 AM | Updated on Aug 21 2026 3:52 AM

Producer Madhavi Reddy Soma about AmeerLog

మనోజ్, వేద, రమణా రెడ్డి, ఎంసీ హరి

‘‘అమీర్‌ లోగ్‌’ సినిమాని ఇప్పటికి చాలాసార్లు చూశాం. ప్రీమియర్లకు వచ్చిన స్పందన చూస్తే హిట్‌ కొట్టేశాం, అనుకున్నది సాధించేశామని అర్థమైంది’’ అని దర్శకుడు రమణా రెడ్డి సోమ చెప్పారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేద జలంధర్, రావణ్‌ నిట్టూరు, విశ్వేందర్‌ రెడ్డి, సాయి యోగి ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘అమీర్‌ లోగ్‌’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ మూవీని స్పిరిట్‌ మీడియా బ్యానర్‌ ద్వారా రానా దగ్గుబాటి నేడు విడుదల చేస్తున్నారు.

గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాధవి రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులు బయటకు వెళ్లేటప్పుడు ఏదో ఒక భావోద్వేగాన్ని ఇంటికి తీసుకువెళ్తారు’’ అని తెలిపారు. ‘‘మా సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి’’ అని ఎంసీ హరి, మనోజ్, వేద జలంధర్, ఎడిటర్‌ రోహిత్, కో ప్రోడ్యూసర్‌ మనోహర్‌ రెడ్డి, నటుడు యోగి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement