అక్టోబరులో కిల్లర్‌ | Jyothi Purvaz Killer to be released on October 17 | Sakshi
Sakshi News home page

అక్టోబరులో కిల్లర్‌

Aug 21 2026 3:47 AM | Updated on Aug 21 2026 3:47 AM

Jyothi Purvaz Killer to be released on October 17

పూర్వాజ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కిల్లర్‌’. జ్యోతి పూర్వాజ్‌ హీరోయిన్‌గా నటించారు. మనీష్‌ గిలాడా, చంద్రకాంత్‌ కొల్లు, విశాల్‌ రాజ్, అర్చన అనంత్, గౌతమ్‌ చక్రధర్‌ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటించారు. ఉర్వీశ్‌ పూర్వాజ్‌ సమర్పణలో పూర్వాజ్, పద్మనాభరెడ్డి .ఎ నిర్మించారు.

అక్టోబరు 17న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, వీడియో గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘సైన్స్‌ ఫిక్షన్‌  థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కిల్లర్‌’. మా సినిమాని ఓవర్సీస్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నాం. ఓఎంజి పిక్చర్స్‌ ఓవర్సీస్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది’’ అని యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement