‌ఆర్తి.. అలా అయిపోవడానికి కారణం కూడా అతనే

Producer Chanti Addala Shocking Comments On Aarthi Agarwal Fade Out - Sakshi

షాకింగ్‌ విషయాలు వెల్లడించిన నిర్మాత చంటి అడ్డాల

ఆర్తి అగర్వాల్‌..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.  నువ్వు నాకు నచ్చావ్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. చిరంజీవి,వెంటకేష్‌, తరుణ్‌, మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, ప్రభాస్‌ సహా దాదాపు అందరు స్టార్‌ హీరోలతోనూ జతకట్టింది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సంపాదించుకుంది. కెరీర్‌ మంచి పీక్ స్టేజ్‌లో ఉండగానే పలు వివాదాలు ఆమెను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. హీరో తరుణ్‌తో ప్రేమాయణం, ఆపై ఆ‍త్మహత్యాయత్నం వంటివి ఆమె కెరీర్‌లో కోలుకోలేని దెబ్బతీశాయి.

తాజాగా ఆర్తి అగర్వాల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆమెకు సినిమా అవకాశాలు తగ్గిపోవడం, ఆమె కెరీర్‌ ఫేడ్‌ అవ్వడానికి గల కారణలపై నిర్మాత చంటి అడ్డాల షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె తండ్రి ఆర్తి అగర్వాల్‌కు సంబంధించి ప్రతీ దాంట్లో ఇన్‌వాల్వ్‌ అయ్యేవాడని,షూటింగ్‌కు కరెక్ట్‌ టైంకు వెళ్తానంటే కూడా అడ్డు చెప్పేవాడని పేర్కొన్నారు. ఆర్తి అగర్వాల్‌ వాళ్ల పేరెంట్స్‌ మీద చాలా వరకు డిపెండ్‌ అయ్యేదని, వాళ్లు ఏం చేయమంటే అది చేసేదని చెప్పారు.


'వాళ్ల పేరెంట్స్‌ షూటింగ్‌ లొకేషన్‌కి రానప్పుడు చాలా కన్వినెంట్‌గా పనిచేసేది. అదే వాళ్లు వచ్చారంటే మాత్రం ఈమెతో పని చేయనిచ్చేవారు కాదు. ఆర్తి అగర్వాల్‌ తండ్రీ ప్రతిదానికి అడ్డుపడేవాడు. షూటింగ్‌ ప్యాకప్‌ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయనే డిసైడ్‌ చేసేవాడు. వాళ్ల ఫాదర్‌ వళ్లే ఆర్తి అగర్వాల్‌ ఇబ్బంది పడేది. ఆయన లేకపోతే ఆమె చాలా ఫ్రీగా పనిచేసేది. నిజానికి ఆమె కెరీర్‌ ఫేడ్‌ అవుట్‌ అవ్వడానికి ఆమె తండడ్రే కారణం' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక బరువు తగ్గేందుకు చేయించుకున్న ఆపరేషన్‌ ‌ వికటించి 2015 జూన్ 6న ఆర్తి అగర్వాల్‌ గుండెపోటుతో మరణించింది.

చదవండి : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న జెనీలియా.. ఆ హీరోతో సినిమా?
ఆ కారణంతో సినిమాలు మానేద్దామనుకున్న సౌందర్య

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top