
వేణుగోపాల్, జగదీష్, శ్రావణి
‘‘ప్రతి ఏడాది వందల చిత్రాలొస్తున్నా, అందులో కొంతమందికి మాత్రమే సక్సెస్ వస్తోంది. చిన్న సినిమాలు ఈ మధ్య అద్భుతాలు సృష్టిస్తున్నాయి. అలా ఈ ‘యముడు’ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలి’’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ అన్నారు. జగదీష్ ఆమంచి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘యముడు’. ‘ధర్మో రక్షతి రక్షితః’ అనేది ఉపశీర్షక. శ్రావణి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
హైదరాబాద్‌లో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమాలోని పాటలను కే మ్యూజిక్ సీఈఓ ప్రియాంక, బెక్కెం వేణుగోపాల్, మల్లిక విడుదల చేశారు. ఈ సందర్భంగా జగదీష్ ఆమంచి మాట్లాడుతూ–‘‘ప్రస్తుతం ఎక్కడ చూసినా కుట్రలు, హత్యలు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఈ పాయింట్‌తో ‘యముడు’ తీశాం’’ అని పేర్కొన్నారు. ‘‘మంచి కథాంశంతో రూపొందిన మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలి’’ అని కెమెరామెన్ విష్ణు, శ్రావణి శెట్టి, మల్లిక, ఆకాష్, భవానీ రాకేష్, స్క్రీన్ ప్లే రైటర్ శివ కోరారు.