Priyanka Jawalkar Shares Interesting Photos on Instagram - Sakshi
Sakshi News home page

Priyanka Jawalkar: హీరోయిన్‌ ఇంట్రస్టింగ్‌ పోస్ట్‌, ఆ క్రికెటరే అంటున్న ఫ్యాన్స్‌

Jun 25 2022 5:18 PM | Updated on Jun 25 2022 7:00 PM

Priyanka Jawalkar Shares Interesting Photos - Sakshi

తాజాగా ప్రియాంక జవాల్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్‌ చేసింది. కానీ ఆ ఫొటోలను తీస్తున్న వ్యక్తిని నేరుగా చూపించకుండా వెనుక నుంచి చూపించింది. ఈ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్‌ ఎమోజీ జత చేసి క్యాప్షన్‌ ఇవ్వడంతో అభిమానులు రెచ్చిపోయారు.

క్రికెటర్స్‌ హీరోయిన్ల మీద మనసు పారేసుకోవడం కొత్తేమీ కాదు. ఎంతోమంది కథానాయికలు క్రికెటర్లతో ప్రేమాయణం నడిపారు. అందులో కొందరు ఓ అడుగు ముందుకేసి ఆ బంధాన్ని పెళ్లి వరకూ తీసుకువెళ్లారు. ఈ లిస్టులో అనుష్క శర్మ- విరాట్‌ కోహ్లి, నటాషా - హార్దిక్‌ పాండ్యా, సంగీత- అజారుద్దీన్‌, సాగరిక - జహీర్‌ ఖాన్‌, హెజెల్‌ కీచ్‌ - యువరాజ్‌ సింగ్‌ వంటి వారు ఎన్నో జంటలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే కొంతకాలంగా యంగ్‌ క్రికెటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌, టాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక జవాల్కర్‌ లవ్‌లో ఉన్నారంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఆ మధ్య ప్రియాంక షేర్‌ చేసిన పిక్‌కు వెంకటేశ్‌ కామెంట్‌ చేయడం, దానికి ఆ హీరోయిన్‌ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే! అప్పటినుంచీ వీరిద్దరినీ ముడిపెడుతూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్‌. 

ఇదిలా ఉంటే తాజాగా ప్రియాంక జవాల్కర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫొటోలు షేర్‌ చేసింది. కానీ ఆ ఫొటోలను తీస్తున్న వ్యక్తిని నేరుగా చూపించకుండా వెనుక నుంచి చూపించింది. ఈ పోస్ట్‌కు అతడే.. అంటూ హార్ట్‌ ఎమోజీ జత చేసి క్యాప్షన్‌ ఇవ్వడంతో అభిమానులు రెచ్చిపోయారు. అతడెవరో కాదు వెంకటేశ్‌ అయ్యరే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అది మా వెంకటేశేనా? మా అన్న కాకపోతే ఇంకెవరు? కొంపతీసి మావాడికి హ్యాండ్‌ ఇచ్చేశావా? అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

చదవండి: సొంత అన్న పెళ్లికి నాగశౌర్య డుమ్మా!
 నడిరోడ్డుపై యంగ్‌ హీరోయిన్‌ చిందులు.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement