విభిన్న కథాంశంతో ప్రియదర్శిని రామ్‌ 'కేస్‌ 99'

Priyadarshini Ram Case 99 Movie Motion Poster Launches By Boyapati Srinu - Sakshi

సాక్షి , హైదరాబాద్‌ : సాక్షి టీవీ సీఈవోగా , ఫ్యామిలీ ఫీచర్స్ ఎడిటర్‌గా, లవ్‌ డాక్టర్‌గా మనకు సుపరిచితులయిన ప్రియదర్శిని రామ్ మంచి టేస్ట్‌ ఉన్న డైరెక్టర్‌ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాస్‌, మనోడు లాంటి విభిన్న చిత్రాలకు దర్శకత్వం వహించి రామ్‌ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన మనోడు సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డుల్లో స్ఫెషల్‌ జ్యరీ నందీ అవార్డు కూడా రామ్‌ సొంతం చేసుకున్నారు. తాజాగా హత్యలు, బలవన్మరణాలు, కిడ్నాప్‌లు,అత్యాచారాలను వెనక ఉన్న హ్యూమన్ ఎమోషన్ కీపాయింట్‌ ఆధారంగా చేసుకొని ప్రియదర్శిని రామ్‌ 'కేస్‌ 99' అనే ఇన్వస్టిగేషన్‌ డ్రామాను తెరకెక్కించారు.  ముఖ్యంగా హైదరాబాద్‌ శివారులో ఓఆర్‌ఆర్‌లు ఏర్పడ్డాకా సిటీ అంచుల్లో భూ తగాదాలు, దందాలు, మాఫియా పేరిట జరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. 

కాగా 'కేస్ 99' సినిమాకు సంబంధించిన టైటిల్ మోషన్ పోస్టర్‌ను ప్రముఖ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను శనివారం రిలీజ్‌ చేయనున్నారు. 115 నిమిషాల నిడివి ఉన్న కేస్‌ 99 సినిమా దీపావళికి సందడి చేయనుందని ఫిలింనగర్‌లో టాక్‌. తిరువీర్, అనువర్ణ, నిహాల్, అజయ్, అపరాజిత, అశోక్ రావు, విజయ్ గోపరాజు, క్రిష్ రాజ్, మనోజ్ ముత్యం, నితిన్ ప్రసన్న, ప్రియదర్శిని రామ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని కీర్తి చిలుకూరి, గౌతమ్ రెడ్డి, వివేక్ రెడ్డి నిర్మిస్తుండగా, ఆషిక్ అరుణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top