మాస్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న ప్రియా ప్రకాష్‌

Priya Prakash Varrier Song Ladi Ladi Garned 1M Views - Sakshi

వన్‌ మిలియన్‌ వ్యూస్‌తో దూసుకుపోతున్న లడి లడి సాంగ్‌

మాలయాళ చిత్రం ‘ఒరు అడార్‌ లవ్‌’లో కన్ను గీటే సన్నివేశంలో నటించి రాత్రికి రాత్రే స్టార్‌డమ్‌ తెచ్చుకుంది నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌. అలా సోషల్‌ మీడియాల్లో సెన్సేషనల్‌ అయిన ప్రియా మాలయాళంతో పాటు తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ ప్రైవేటు ఆల్బమ్‌లో కూడా ఆడిపాడింది. లడి లడి అంటూ సాగే ఈ పాటలో ప్రియా తన మాస్‌ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటోంది. కొత్త నటుడు రోహిత్‌ నందన్‌తో కలిసి ఆమె చిందులేసిన ఈ పాటకు రఘు మాస్టర్‌ కోరియోగ్రాఫి అందించగా.. బిగ్‌బాస్‌ 3 ఫేం, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. పాకాల శ్రీచరణ్‌ సంగీతం సమకూర్చగా.. విస్పాప్రగడ లిరిక్స్‌ అందించారు. ఈ  సంక్రాంతి సందర్భంగా మ్యాంగో సంస్థ వారు ఈ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో దుమ్మురేపుతోంది. మాస్‌ బీట్‌లో రాహుల్‌ సిప్లిగంజ్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ రాగా ఫీమెల్‌ వాయిస్‌ను ప్రియా అందించారు. (చదవండి: సింగర్‌ అవతారమెత్తిన ‘కన్ను గీటు’ భామ)

ఇప్పటి వరకు ఈ పాటకు ఒక మిన్‌యన్ వ్యూస్‌ రావడంతో ప్రియా ప్రకాష్‌ ఆనందం వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పంచుకున్నారు. ‘లడి లడి పాట ఒక మిలియన్‌ వ్యూస్‌ను అందుకుంది. ఇది ఇంత పెద్ద హిట్‌ అవుతుందని నేనే గ్రహించలేదు. ఇంత  సక్సెస్‌ ఇచ్చిన ఆడియన్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్న. ఈ సందర్భంగా నా  టీంకి కూడా ధన్యవాదాలు. ఇది నా ఒక్కదాని బలం కాదు, రఘు మాస్టర్‌ టీంతోనే సాధ్యమైంది. దానికి నేను న్యాయం చేయగలిగాను’ అంటూ రాసుకొచ్చారు. ఇక పాట చిత్రీకరణ సమయంలో ఆమె చాలా సార్లు గాయపడినట్లు పేర్కొంది. రిహార్సల్స్‌లోనూ చాలా ఇబ్బంది పడ్డానని, కానీ ఈ పాటకు ఇంతమంచి రెస్పాన్స్‌ రావడంతో ఆ బాధ మొత్తం పోయి చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం ప్రియా తెలుగులో నితిన్‌ సరసన చెక్‌ మూవీ నటిస్తున్నారు. (చదవండి: చెక్‌ మాస్టర్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top