సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు: ప్రియా ప్రకాశ్ | Sakshi
Sakshi News home page

Priya Prakash Varrier: అద్దముందు నిలబడి హీరోయిన్లలాగా నటించేదాన్ని: ప్రియా ప్రకాశ్

Published Fri, Oct 6 2023 10:46 AM

Priya Prakash Varrier Opens About Her Entry Into Film Industry - Sakshi

ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుందంటారు. అలా ఒకే ఒక్క చిత్రం నటి ప్రియా ప్రకాష్‌ వారియర్‌ జీవితాన్నే మార్చేసింది. ఆమె హీరోయిన్‌గా పరిచయమైన మలయాళ చిత్రం ఓరు అదారు లవ్‌. ఈ చిత్రం విజయం సాధించిందా అంటే అదీ లేదు. అయితే ట్రైలర్‌.. ఆ చిత్రానికి కావలసిన దానికంటే ఎక్కువ క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. ముఖ్యంగా నటి ప్రియాప్రకాష్‌ వారియర్‌ తన లవర్‌కు కన్ను కొట్టే దృశ్యం యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించింది. ఆ చిత్రం మలయాళంతో పాటు ఇతర భాషల వ్యాపారానికి కూడా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ను పాపులర్‌ చేసింది. 

(ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!)

అయితే ఇదంతా జరిగి చాలాకాలమైంది కదా.. మళ్లీ ఇప్పుడెందుకు అంటారా? దీనిపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తనకు చిన్నతనం నుంచి సినిమాలు చూడడం చాలా ఇష్టమని చెప్పింది. సినిమాలు చూసి ఇంటికి వచ్చిన తరువాత అద్దం ముందు నిలబడి ఆయా చిత్రాల హీరోయిన్ల మాదిరి నటించేదానినని చెప్పింది. తాను నటి అవుతానని తన తల్లిదండ్రులే కాదు.. తానూ ఊహించలేదని తెలిపింది.

అలా చదువుకుంటున్న సమయంలోనే ఆడిషన్‌లో పాల్గొన్న సెలెక్ట్‌ అయ్యానని.. ఆ చిత్రాన్ని పూర్తి చేయడానికి తన తల్లిదండ్రులు అంగీకరించినట్లు చెప్పింది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రావడంతో నటిగా మారినట్లు చెప్పింది. కాగా ప్రియా ప్రకాశ్ మలయాళంతో పాటు తెలుగు తమిళం , హిందీ భాషల్లోనూ నటిస్తోంది. కాగా తను తొలి చిత్రం ట్రైలర్‌లో కన్ను కొట్టిన దృశ్యాన్ని బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రిషికపూర్‌ చూసి చాలా మంచి నటి అవుతుందని, ఈ నటి తన కాలంలో ఎందుకు రాలేదని ప్రశంసలు కురిపించారట. దీంతో ఆయన ప్రశంసల కంటే పెద్ద అవార్డు ఏముంటుందని పేర్కొంది . నటిగా తాను ఎంత పాపులర్‌ అయ్యానో తెలియదు.. కానీ రిషికపూర్‌ కితాబును జీవితాంతం మరిచిపోలేనని ట్విట్టర్‌లో వెల్లడించింది.  

(ఇది చదవండి: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్‌ హీరోయిన్‌కు సమన్లు!)

Advertisement
 
Advertisement