త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు! | Bigg Boss Telugu Season 7 Day 32 Highlights: Subhashree, Prince Yawar Sacrifice Letters - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌కు వార్నింగ్‌ ఇస్తున్న శివాజీ.. ఇష్టం లేకపోయినా త్యాగం చేసిన శుభశ్రీ, అతడివల్లే!

Published Fri, Oct 6 2023 9:15 AM

Bigg Boss 7 Telugu: Subhashree, Prince Yawar Sacrifice Letters - Sakshi

బిగ్‌బాస్‌ అంటేనే ఫిట్టింగ్‌ బాస్‌.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్‌ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్‌ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్‌ 5) ఎపిసోడ్‌ హైలైట్స్‌లో చదివేయండి..

యావర్‌కు తెలుగు క్లాసులు
బిగ్‌బాస్‌ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్‌ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్‌బాస్‌ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్‌ దీప్‌- సందీప్‌, శివాజీ- ప్రశాంత్‌, తేజ- యావర్‌, గౌతమ్‌- శుభశ్రీలు నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో తేజ, అమర్‌దీప్‌, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు.

రిక్వెస్ట్‌ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్‌లు..
అల్లరి విద్యార్థిగా యావర్‌ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్‌బాస్‌ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్‌ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్‌? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్‌ చూసిన బిగ్‌బాస్‌ అతడికి కాఫీనే పంపించలేదు.

ఎమోషనల్‌ టాస్క్‌..
ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్‌ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్‌ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్‌ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్‌ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట!

త్యాగం చేసిన శుభ శ్రీ
ఈ టాస్క్‌ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్‌ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్‌ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్‌ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్‌- శుభశ్రీ.. ఎవరు లెటర్‌ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్‌ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.

తన లేఖను చించేసిన యావర్‌
యావర్‌- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్‌ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్‌ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్‌లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి!

Advertisement
 

తప్పక చదవండి

Advertisement