
మలయాళ నటుడు 'పృథ్వీరాజ్ సుకుమారన్'(Prithviraj Sukumaran) నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మలయాళ కొత్త సినిమా 'ఖలీఫా'(Khalifa) నుంచి పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు వైశాఖ్ తెరకెక్కిస్తున్న రివెంజ్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 15ఏళ్ల తర్వాత 'పోక్కిరి రాజా' (2010) మళ్లీ వారిద్దరూ కలిసి ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు.

అమీర్ అలీగా ఆయన ఈ సినిమాలో కనిపిచనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుంది. ఇందులో విద్యుత్ జమ్వాల్, సత్యరాజ్, కృతి శెట్టి, ప్రియంవద కృష్ణన్ నటించనున్నారు. 2026 ఓనమ్ పండుగ సందర్భంగా పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది.