అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. లిరికల్‌ సాంగ్‌ | Premikudu Movie Andamaina Premarani Lyrical Song | Sakshi
Sakshi News home page

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. లిరికల్‌ సాంగ్‌

Feb 14 2021 5:34 PM | Updated on Feb 14 2021 5:34 PM

Premikudu Movie Andamaina Premarani Lyrical Song - Sakshi

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే..

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. 
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే.. 
ఊహూ..భూమికే భూపాలమే ‘‘2‘‘

సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
ఎంగిలైన అమృతమ్ములే
బొండుమల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్‌ అర్ధరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరూపాయలు
‘‘అందమైన‘‘

ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానెకాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకశం భూమి మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే ఆది జంట పాడిన పాటలే..
ఇంకా వినిపించులే ప్రేమ తప్పు మాటని...
ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో..
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందులో నువ్వు వెళ్ళు నిర్భయంగా.. 


చిత్రం : ప్రేమికుడు
రచన : రాజశ్రీ
గానం : యస్పీ బాలు, ఉదిత్‌ నారాయణ్, యస్పీ పల్లవి
సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌ 

Advertisement
 
Advertisement
Advertisement