Prem Chopra: శాడిస్టులు, బతికుండగానే నాకు సమాధి కడుతున్నారు..

Prem Chopra about Death Rumours: This Is Sadism - Sakshi

సోషల్‌ మీడియా తెచ్చే తంటాలు అన్నీఇన్నీ కావు. జనన మరణవార్తలను వేగంగా అందరికీ చేరవేసే ఈ మాధ్యమం అసత్యపు ప్రచారాలను సైతం అంతే వేగంగా వ్యాపింపజేస్తుంది. తాజాగా ఓ సీనియర్‌ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని అతడి ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. తనను బతికుండగానే సమాధి చేస్తున్నారేంటని ఆవేదన చెందిన ప్రేమ చోప్రా తను ప్రాణాలతోనే ఉన్నానంటూ స్పందించాడు.

బాలీవుడ్‌ హిట్‌ సినిమాల్లో విలన్‌గా రాణించిన ఈ సీనియర్‌ నటుడు మీడియాతో మాట్లాడుతూ.. 'నన్ను బతికుండగానే చంపేస్తున్నారు. దీన్నే శాడిజం అంటారు. నేను ఇక లేనంటూ పుకారు లేపి ఎవరో రాక్షసానందం పొందుతున్నారు. కానీ నేను మీతో హృదయపూర్వకంగా మాట్లాడుతున్నాను. నాకు నిన్న ఉదయం నుంచి ఎన్నో ఫోన​్‌ కాల్స్‌ వస్తున్నాయి. సెలబ్రిటీ మిత్రులు ఫోన్లు చేసి అంతా బాగానే ఉంది కదా అని అడుగుతున్నారు. అసలు నేను చనిపోయానంటూ ఎవరు ప్రచారం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. గతంలో నా ఆప్తమిత్రుడు జీతేంద్ర కూడా మరణించాడంటూ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు నన్ను టార్గెట్‌ చేశారు. ఇక ఈ చెత్త వాగుడు ఆపండి' అని చెప్పుకొచ్చాడు.

కాగా ప్రేమ్‌ చోప్రా, అతడి భార్య ఉమ ఇద్దరూ ఈ ఏడాది ప్రారంభంలో కోవిడ్‌ బారిన పడటంతో ముంబై ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఇద్దరూ డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ప్రేమ్‌ చోప్రా సినిమాల విషయానికి వస్తే అతడు దోస్తానా, క్రాంతి, జాన్వర్‌, షాహీద్‌, ఉపకార్‌, పురబ్‌ ఔర్‌ పశ్చిమ్‌, దో రాస్తే, కటి పతంగ్‌, దో అంజానే, జాదు తోనా, కల సోనా వంటి పలు సినిమాల్లో అలరించాడు.

చదవండి: నాకు లైన్‌ వేయడం ఆపు అనన్య.. విజయ్‌ రిక్వెస్ట్‌
 నా ప్రేమ గురించి ఆరోజే వెల్లడిస్తా: విజయ్‌ దేవరకొండ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top