Sadha Nannu Nadipe: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ

Prathik Prem Sadha Nannu Nadipe Movie Review In Telugu - Sakshi

'వాన‌విల్లు ' చిత్రం త‌ర్వాత హీరో ప్రతీక్ ప్రేమ్ క‌ర‌ణ్ న‌టించిన మూవీ 'సదా నన్ను నడిపే'. వైష్ణవి పట్వర్ధన్ హీరోయిన్. నాగేంద్ర బాబు, నాజర్, రాజీవ్ కనకాల, ఆలీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి హీరో ప్రతీక్‌ ద‌ర్శ‌క‌త్వం, స్క్రీన్‌ప్లే, సంగీతం అందించాడు. స్వచ్చమైన ప్రేమ కథతో తెరకెక్కిన ఈ మూవీ జూన్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ:
ఎమ్.జే అలియాస్ మైఖేల్ జాక్సన్ (ప్రతీక్ ప్రేమ్ కరణ్) సరదాగా స్నేహితులతో గడిపే కుర్రాడు. అతడు సాహా(వైష్ణవి పట్వర్దన్)తో ప్రేమలో పడతాడు. ఆమె ఎంత కాదన్నా ఎంతో సిన్సియర్‌గా లవ్ చేస్తూ ఉంటాడు. సాహా తండ్రి రాజీవ్ కనకాల కూడా ఎమ్‌జే ప్రేమని అంగీకరించడు. అయితే హీరో మాత్రం ఎలాగైనా సాహా ప్రేమని పొందాలని పరితపిస్తూ వుంటాడు. ఎట్టకేలకు సహా ప్రేమను అంగీకరించి అతడిని పెళ్లాడుతుంది సాహా. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే అతడిని దూరం పెడుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని కూడా సాహా... ఎమ్‌జేను ఎందుకు దూరం పెడుతూ ఉంటుంది? ఆమె సమస్య ఏంటి? హీరో దాన్ని ఎలా పరిష్కరించాడు? వీరిద్దరూ చివరికి కలుసుకున్నారా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే...!!!

విశ్లేషణ: హీరో చెప్పినట్టు ఇంతకు ముందు స్వచ్చమైన ప్రేమకథలతో గీతాంజలి, కలిసుందాం రా లాంటి సినిమాలు వచ్చి బాక్సాఫీస్‌ను కళకళలాడించాయి. ఇప్పుడీ చిత్రాన్ని కుడా హీరో కమ్ డైరెక్టర్ ప్రతీక్ ప్రేమ్ కరణ్... ఎంతో ఎమోషనల్‌గా సిల్వర్ స్క్రీన్‌పై ఆ విష్కరించాడు. మ‌న‌కు బాగా తెలిసిన వ్య‌క్తి చ‌నిపోతున్నారని తెలిశాక వారితో వున్న కొద్దిక్ష‌ణాలను ఎంత మధుర జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటామో అనేది ఇందులో చూపించారు. ప్రేమించిన వ్యక్తి కోసం ఎలాంటి త్యాగాన్ని అయినా చెయ్యొచ్చనినే విషయాన్ని ఎంతో ఎమోష‌నల్ గా తెరకెక్కించాడు. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన ఓ వాస్తవ సంఘటనను ఆధారంగా తీసుకుని సినిమాటిక్‌గా మార్చిన తీరు బాగుంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా వుంది.

ప్రతీక్ ప్రేమ్ చాలా బాగా చేశాడు. హీరోగా నటిస్తూనే.. దర్శకత్వ బాధ్యలను సమర్థవంతంగా నిర్వహించాడు. హీరోయిన్ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అలీ వున్నంత సేపు బాగా నవ్వులు పుయించాడు. నాగబాబు, రాజీవ్ కనకాల తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. సంగీతం బాగుంది. నందు కంపోజ్ చేసిన ఫైట్స్ బాగున్నాయి. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, కొడైకెనాల్‌, కులుమ‌నాలిలో చిత్రీకరించిన లోకేషన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్‌గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిమ్‌ చేసుంటే బాగుండేది.

చదవండి: రణ్‌బీర్‌ కపూర్‌ కారుకు యాక్సిడెంట్‌
 ‘సమ్మతమే’ మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top