జర్నలిస్ట్‌ ప్రకాశ్‌ రాజ్‌ | Prakash Raj starts shooting for KGF 2 | Sakshi
Sakshi News home page

జర్నలిస్ట్‌ ప్రకాశ్‌ రాజ్‌

Aug 27 2020 2:18 AM | Updated on Aug 27 2020 2:18 AM

Prakash Raj starts shooting for KGF 2 - Sakshi

యష్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 1 ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌’ చాప్టర్‌ 2’ని ప్యాన్‌ ఇండియా స్థాయిలో చిత్రీకరిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేకులు పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి షూటింగ్‌లకు అనుమతి రావడంతో బుధవారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ బెంగళూరులో పునః ప్రారంభమైంది.

ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రకాష్‌రాజ్‌ బుధవారం షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోల్ని షేర్‌ చేసి, ‘కొంత విరామం తర్వాత మళ్లీ షూటింగ్‌ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. తొలి భాగంలో నటుడు అనంత్‌ నాగ్‌ పోషించిన జర్నలిస్ట్‌ ఆనంద్‌ వాసిరాజు పాత్రలో ప్రకాష్‌ రాజ్‌ నటిస్తున్నారని టాక్‌. ఇప్పటికే 80శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా 20 శాతం పూర్తి కావాల్సి ఉంది. దక్షిణాదిలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement