MAA Association Elections: Prakash Raj And Manchu Vishnu Contest For MAA - Sakshi
Sakshi News home page

అధ్యక్ష పదవికి సీనియర్‌ నటుడు, యంగ్‌ హీరో మధ్య పోటీ!

Jun 22 2021 8:12 AM | Updated on Jun 24 2021 11:55 AM

Prakash Raj, Manchu Vishnu Contest For MAA Association - Sakshi

తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా ఉంటుందని ఫిల్మ్‌నగర్‌ హాట్‌ టాపిక్‌. నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే ‘మా’ అధ్యక్షుడి స్థానం కోసం బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పోటీలో నిలబడనున్నట్లు వార్త వచ్చింది.

అటు సీనియర్‌ నటుడు ఇటు యంగ్‌ హీరో అధ్యక్ష పదవికి పోటీ పడటం అంటే చర్చనీయాంశమే. ఒకవైపు ప్రకాశ్‌రాజ్‌ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విష్ణు కూడా సూపర్‌ స్టార్‌ కృష్ణ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను స్వయంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఇద్దరూ ఏ ఎజెండాతో ముందుకొస్తారో చూడాలి. 

చదవండి: పెళ్లి వాయిదా అనంతరం క్రేజీ ఆఫర్‌ కొట్టేసిన మెహ్రీన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement