కృత్రిమ కాలుతో ప్రభుదేవా.. పోస్ట్‌ వైరల్‌

Prabhu Deva Plays Physically Challenged in Poikkal Kuthirai Movie - Sakshi

చెన్నై: ప్రభుదేవా హీరోగా నటిస్తున్న చిత్రం పొయిక్కల్  కుదిరై. ఇప్పటికే డ్యాన్స‌ర్‌గా, నటుడిగా, ద‌ర్శ‌కుడిగా అలరించిన ప్రభుదేవా మళ్లీ చాలా గ్యాప్‌ తర్వాత నటుడిగా ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అయ్యారు. సంతోష్‌ పి.జయకుమార్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న ఈ  చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రం బుధవారం విడుదల చేశారు.ప్రభుదేవా కృత్రిమ కాలుతో కనిపిస్తున్నాడు. 

ఒక చేతితో రెంచ్‌ పట్టుకుని, మరోచేతితో పసిబిడ్డను ఎత్తుకున్నారు. శత్రువుల బారి నుంచి ఆ పాపను కాపాడే ఎలా కాపాడాడన్న నేపథ్యంలో కథ ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభుదేవాకు జంటగా వరలక్ష్మీశరత్‌కుమార్, రైజానెల్సన్‌ నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్- సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top