ఆగిపోయిన ప్రభాస్‌ సలార్‌ షూటింగ్‌!.. కారణం అదేనా? | Prabhas Salaar Movie Shooting Postponed Due to Knee Surgery | Sakshi
Sakshi News home page

Salaar Movie : సలార్‌ షూటింగ్‌కి బ్రేకులు.. ఆగిపోయిన షూటింగ్‌

Mar 30 2022 1:12 PM | Updated on Mar 30 2022 1:22 PM

Prabhas Salaar Movie Shooting Postponed Due to Knee Surgery - Sakshi

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రీసెంట్‌గా రాధేశ్యామ్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్‌ నుంచి ఒక యాక్షన్‌ మూవీ కోసం​ డార్లింగ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సలార్‌  చిత్రం రిలీజ్‌ అవుతుందా అని వెయిట్‌ చేస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు ఇంకా సమయం పట్టేలా ఉంది.  ఎందుకంటే ఇప్పటివరకు సలార్‌ షూటింగ్‌ 60శాతం కూడా పూర్తికాలేదు.

మరోవైపు ఇప్పడీ సినిమాకి బ్రేకులు పడినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం సలార్‌ షూటింగ్‌ ప్రస్తుతం ఆగిపోయినట్లు టాక్‌ వినిపిస్తుంది. రాధేశ్యామ్‌ రిలీజ్‌ తర్వాత చిన్న సర్జరీ కోసం ప్రభాస్‌ విదేశాలకు వెళ్లడం, పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు నెలలు పట్టడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ని ఆపేశారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే వచ్చే ఏడాది సలార్‌ను రిలీజ్‌ చేయాలని భావించినా షూటింగ్‌ ఆలస్యమైతే, మరింత సమయం పట్టేలా కనిపిస్తుంది. దీంతో ఈ యాక్షన్‌ మూవీ కోసం ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మరిన్ని రోజులు ఎదురుచూడక తప్పదు. 

Advertisement
 
Advertisement
Advertisement