మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల! | Sakshi
Sakshi News home page

Prathikadalo Song (Telugu): సలార్ నుంచి సూపర్ సాంగ్ వచ్చేసింది!

Published Thu, Dec 21 2023 6:21 PM

Prabhas Salaar Movie Prathikadalo Song Released Today - Sakshi

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు మరికొద్ది గంటల్లో రానుంది. యంగ్ రెబల్ ఫ్యాన్స్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్ ఈనెల 22న తెల్లవారుజామునే థియేటర్లలో సందడి చేయనుంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్  తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించింది. ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే టికెట్స్ బుకింగ్ ప్రారంభం కాగా.. లక్షల్లో అమ్ముడయ్యాయి. 

తాజాగా ఈ చిత్రం నుంచి మరో లిరికల్ సాంగ్‌ రిలీజ్ చేశారు మేకర్స్. 'ప్రతి గాథలో' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించారు. ఇప్పటికే రిలీజైన సాంగ్, ట్రైలర్స్ ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. 

Advertisement
Advertisement