ఈ పండగ సీజన్‌లో విడుదలైన ప్రభాస్ – మారుతి రాజాసాబ్ సినిమా తరువాత ప్రభాస్‌కి వరుసగా పెద్ద ప్రాజెక్టులు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఒక మెగా హీరోతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మారుతి కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు.
వీలైనంత రీజనబుల్ బడ్జెట్‌లో, మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే ఆ మెగా హీరో ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాతే మారుతి సినిమా వైపు అడుగులు వేయనున్నారు.ప్రస్తుతం మారుతి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లను పదును పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. కథ రెడీ అయిన వెంటనే ఈ మెగా ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


