breaking news
Maruthi 800
-
మెగా హీరోతో మారుతి కొత్త సినిమా!
ఈ పండగ సీజన్లో విడుదలైన ప్రభాస్ – మారుతి రాజాసాబ్ సినిమా తరువాత ప్రభాస్‌కి వరుసగా పెద్ద ప్రాజెక్టులు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ దర్శకుడు మారుతి తదుపరి సినిమా ఏమిటన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మారుతి ఒక మెగా హీరోతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మారుతి కి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నారు. వీలైనంత రీజనబుల్ బడ్జెట్లో, మంచి కథతో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కథ ఫైనల్ అయిన వెంటనే ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైమ్ ఉంది. ఎందుకంటే ఆ మెగా హీరో ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలి. ఆ తరువాతే మారుతి సినిమా వైపు అడుగులు వేయనున్నారు.ప్రస్తుతం మారుతి తన దగ్గర ఉన్న స్క్రిప్ట్‌లను పదును పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. కథ రెడీ అయిన వెంటనే ఈ మెగా ప్రాజెక్ట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సినిమా చూడలేకపోయా.. ఏడ్చేశా : ‘ది రాజాసాబ్’ డైరెక్టర్
ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 201 కోట్లు కలెక్షన్స్ సాధించింది. సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్‌లో మాత్రం దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా ప్రీమియర్స్‌కి నైజాంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడింది. టికెట్ల రేట్ల పెంపు, ప్రీమియర్‌షోకి ప్రభుత్వం నుంచి ఆలస్యంగా అనుమతి లభించింది. అర్థరాత్రి వరకు జీవీ రాకపోవడంతో..నైజాం ఏరియాలో ప్రీమియర్స్ పడలేదు. మీడియా కోసం హైదరాబాద్‌లోని విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేయగా.. విషయం తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అక్కడకు తరలివచ్చారు. గేట్లు బద్దలుకొట్టుకొని మరీ థియేటర్లోకి చొరబడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి.. అందరిని బయటకు పంచింపిన తర్వాత అర్థరాత్రి 12.45 గంటలకు మీడియాకు షో వేశారు. ఈ విషయం తెలిసి చాలా టెన్షన్ పడ్డారట సినిమా దర్శకుడు మారుతి. ఒకవైపు ప్రీమియర్స్ షోకి అనుమతి రాకపోవడం, మరోవైపు మీడియా షో ఆలస్యం అవ్వడంతో టెన్షన్ భరించలేక కారులో కూర్చొని ఏడ్చేశారట. ఈ విషయాన్ని తాజాగా ఆయనే మీడియాతో చెప్పారు. రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మారుతి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘మీ కెరీర్లోనే అతి పెద్ద సినిమా ది రాజాసాబ్ రిలీజ్ రోజు ఎలా ఫీలయ్యారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించాడు. దానికి ఆయన మారుతి సమాధానం చెబుతూ.. ‘నా తొలి సినిమా ‘ఈ రోజుల్లో’ రిలీజ్ రోజు చాలా ఏడ్చేశా. అప్పుడు నాకు ఎదురైన సవాళ్లను చూసి..ఇకపై ఇండస్ట్రీ వైపే రావొద్దనుకున్నా. అలాగే ది రాజాసాబ్ రిలీజ్ రోజు కూడా చాలా టెన్షన్ పడ్డాను. ఒకవైపు నైజాంలో ప్రీమియర్ షోకి అనుమతి రాలేదు. మీడియా కోసం ఏర్పాటు చేసిన షోకి ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చారనే విషయం తెలిసింది. మీడియా వాళ్లు అర్థరాత్రి వరకు వేచి చూశారనే విషయం తెలిసి బాధపడ్డాను. టెన్షన్ తట్టుకోలేక కారులో కూర్చొని ఏడ్చేశా. ఫ్యాన్స్‌కి ప్రీమియర్ షో వేయలేకపోయామనే బాధతో నేను కూడా సినిమా చూడకుండానే వెళ్లిపోయాను’ అని మారుతి చెప్పుకొచ్చాడు. -
మురిపెంగా.. మొదటి మారుతి!
భారతదేశంలో వ్యక్తిగత రవాణా వాహనాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చింది ‘మారుతి 800’. 1980లలో ఉన్నత, ఎగువ మధ్య తరగతి కుటుంబాలతో ఈ కారు భావోద్వేగపూరిత బంధాన్ని పెనవేసుకొంది. కొంతమందిలో ఆ బంధం ఇప్పటికీ తాజాగా ఉంది. హర్పాల్సింగ్, గుల్షాన్బీర్ కౌర్... దేశంలో అమ్ముడైన తొలి మారుతి 800 ఓనర్లు! మార్కెట్లో అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనడానికి లక్షల మంది పోటీ పడగా, లక్కీ డ్రాలో ఆ అదృష్టం వీరిని వరించింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా హర్పాల్ తొలి కారు తాళం చెవులు అందుకొన్నారు! అప్పటి ధర 47,000. 33 యేళ్లు గడిచిపోయాయి. హర్పాల్ తర్వాత ఎంతమంది ఆ కారును కొన్నా, ఆ క్రేజీ కారు తొలి ఓనర్‌గా ఈ సర్దార్జీ చరిత్రలో స్థానం సంపాదించుకొన్నారు. 2010లో హర్పాల్ సింగ్ మరణించారు. రెండేళ్ల తర్వాత ఆయన భార్య కూడా కాలం చేశారు. ఇదే సమయంలో మారుతి కంపెనీ 800 కారుల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించింది. కాలుష్య నియంత్రణ విషయంలో అమల్లోకి వచ్చిన చట్టాల నేపథ్యంలో ఈ కారు ఉత్పత్తిని ఆపివేస్తున్నట్టుగా దాదాపు ఏడాది కిందట మారుతి ఇండియా లిమిటెడ్ ప్రకటించింది. దీంతో చాలా మంది మారుతి 800 ఓనర్లు గందరగోళంలో పడ్డారు. తమ కార్లను వదిలించుకొన్నారు! అయితే హర్పాల్ సింగ్ కుటుంబం మాత్రం ఆ కారును వదులుకొనే ప్రసక్తే లేదంటోంది. తొలి అనుబంధం తమ దగ్గరే పదిలంగా ఉండాలని కోరుకుంటోంది.


