'కల్కి 2' షూటింగ్ 60% అయిపోయింది.. నిర్మాత కామెంట్స్ | Prabhas Kalki Part 2 Updates Latest Revealed Producer Ashwini Dutt | Sakshi
Sakshi News home page

Kalki 2898AD: సీక్వెల్ గురించి క్రేజీ అప్డేట్.. ప్లానింగ్ పెద్దదే

Jun 29 2024 1:32 PM | Updated on Jun 29 2024 1:52 PM

Prabhas Kalki Part 2 Updates Latest Revealed Producer Ashwini Dutt

ప్రస్తుతం 'కల్కి' హ్యాంగోవర్‌ నడుస్తోంది. ఇక్కడ అక్కడా అనే తేడా లేకుండా అందరూ ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. తొలిరోజు రూ.191 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. లాంగ్ రన్‌లో రూ.1000 కోట్లు సొంతం చేసుకుంటుందా లేదా అనేది చూడాలి? ఇలా అందరూ 'కల్కి' ఊపులో ఉండగానే సీక్వెల్ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

(ఇదీ చదవండి: 'కల్కి'పై హాలీవుడ్ ప్రశంసలు.. రేంజు పెరిగిపోయింది!)

'కల్కి' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో నిర్మాత అశ్వనీదత్ మీడియాతో మాట్లాడారు. సీక్వెల్ గురించి అడగ్గా.. ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని, కాకపోతే మేజర్ సీక్వెన్స్ మాత్రం పెండింగ్‌లో ఉంచామని చెప్పారు. వాటి షూటింగ్ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇస్తామని అన్నారు.

అశ్వనీదత్ చెప్పిన దానిబట్టి చూస్తే ఏడాది ఏడాదిన్నరైనా చిత్రీకరణం పూర్తి చేయొచ్చు. కానీ అందరూ డేట్స్ కుదిరితేనే ఇది సాధ్యమవుతుంది. నాగ్ అశ్విన్ చేతిలో వేరే ప్రాజెక్ట్ ఏం లేదు కాబట్టి ముందు దీన్నే కంప్లీట్ చేస్తాడు. చూడాలి మరి 'కల్కి'ని సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రకటించారు కాబట్టి రెండో భాగంలో కొత్త పాత్రలు ఏమైనా వచ్చి సర్‌ప్రైజ్ చేస్తాయేమో?

(ఇదీ చదవండి: మహాభారతం గురించే డిస్కషన్.. ఇదంతా 'కల్కి' వల్లే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement