Teaser War: Prabhas Vs Shahrukh Khan; Who Will Win? - Sakshi
Sakshi News home page

Prabhas vs SRK: షారుఖ్ vs ప్రభాస్.. గెలిచేది అతనేనా?

Jul 4 2023 9:15 AM | Updated on Jul 4 2023 9:56 AM

Prabhas And Shahrukh Khan Between Teaser War - Sakshi

పాన్‌ ఇండియా సినిమా వార్‌లో  రోజుల వ్యవధిలోనే రెండు బిగ్ సినిమాలకు సంబంధించిన టీజర్స్ బయటికి వస్తే ఎలా ఉంటుంది. వారి ఫ్యాన్స్‌తో యూట్యూబ్‌ షేక్‌ అవడం గ్యారెంటీ. జులై 6న పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ 'సలార్‌' టీజర్‌తో వస్తే.. జులై 7న బాలీవుడ్‌ కింగ్‌ షారుఖ్‌ 'జవాన్‌'తో రానున్నాడని తెలుస్తోంది. ఇదీ జరిగితే ఈ రెండు సినిమాల టీజర్లు కేవలం కొన్ని గంటల వ్వవధిలో విడుదల అవుతాయి. దీంతో వారిద్దరి ఫ్యాన్స్‌ యూట్యూబ్‌ వ్యూస్‌లో తమ సత్తా చాటేందుకు పొటీ పడుతున్నారు. 

(ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)

KGF తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్ రాబోతోంది. ఈ సినిమా కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్‌ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఆదిపురుష్ గేమ్‌ ఓవర్‌ కావడంతో ఇప్పుడు సలార్ టైం స్టార్ట్ అయిపోయిందని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

మరోవైపు ఇటీవల 'పఠాన్' సినిమాతో బాలీవుడ్‌లో బౌన్స్ బ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్.. 'జవాన్‌'తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని చూస్తున్నాడు. పఠాన్‌తో తన కెరీయర్‌లోనే బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌ రూ.1000 కోట్లు రాబట్టాడు. ఇదే జోరును కొనసాగిస్తూ.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్' సినిమా జులై 12న విడుదల కానుంది.. ఈ మూవీ మధ్యలో జవాన్‌ టీజర్‌ను రిలీజ్ చేయనున్నారని కూడా ప్రచారం జరుతుంది. 

(ఇదీ చదవండి: విజయ్‌ను డైరెక్ట్‌ చేసే లాస్ట్‌ ఛాన్స్‌ ఆ దర్శకుడికే..)

ఇప్పుడు ఈ టీజర్ వార్ పీక్స్‌లోకి వెళ్లింది. ఏదేమైనా ఈ రెండు టీజర్లు రిలీజ్‌ అయ్యాక  ఏది ఎక్కువ వ్యూస్ రాబట్టింది? అనే చర్చ జరగడం  పక్కాగ ఉంటుంది. కానీ 'జవాన్' కంటే 'సలార్' పైనే భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఒకరేమో కొన్నేళ్లుగా బాలీవుడ్‌ను శాసించే కింగ్‌ కాంగ్‌... మరోకరేమో పాన్‌ ఇండియా స్టార్‌. దీంతో డార్లింగ్‌ డై హార్ట్‌ ఫ్యాన్స్‌ కొంచెం సీరియస్‌గానే తీసుకున్నారు. ఎదేమైనా  ఈ పోటీలో జవాన్ కంటే సలార్‌ పైనే భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి సోషల్ మీడియాలో అప్పర్ హ్యాండ్ డార్లింగ్‌దే  కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement