
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో కృతీ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ దాదాపు ఇరవైఅయిదు రోజుల పాటు జరుగుతుందని బాలీవుడ్ సమాచారం. ఈ షెడ్యూల్‌లో ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట ఓం రౌత్.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన రిహార్సల్స్ కూడా ఆరంభించారట ప్రభాస్. ముందుగా యాక్షన్ సీన్స్, ఆ తర్వాత టాకీ పార్ట్‌ని చిత్రీకరిస్తారని సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‌లో రాముడి పాత్రలో ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపిస్తారు. ఈ సినిమా వచ్చే ఏడాది అక్టోబరు 11న విడుదల కానుంది.