Prabhas Adipurush Gets Censor Certificate From Board - Sakshi
Sakshi News home page

'ఆదిపురుష్‌' సెన్సార్‌ పూర్తి.. నైజాం రైట్స్‌ నుంచి తప్పుకున్న దిల్‌ రాజు

Jun 8 2023 5:27 PM | Updated on Jun 8 2023 5:33 PM

Prabhas Adipurush Gets Censor Certificate from Board - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన మైథలాజికల్‌ చిత్రం.. 'ఆదిపురుష్‌'. ఈ నెల 16న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది.ఇప్పటికే తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను  ఘనంగా నిర్వహించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు ఈ చిత్రానికి యు (U) సర్టిఫికెట్‌ జారీ చేసింది.

(ఇదీ చదవండి: వరుణ్‌, లావణ్య త్రిపాటి మధ్య ప్రేమ ఎలా మొదలైందంటే..!)

ఈ సినిమా నిడివి 2 గంటల 59 నిమిషాలు ఉంది. ఈ మధ్య  టాలీవుడ్‌లో ఎక్కువ రన్‌టైమ్‌తో చాలా సినిమాలు తెరకెక్కాయి. కంటెంట్‌ బాగుంటే ఎన్ని గంటలున్నా సినిమా సూపర్‌ హిట్టే. అయితే విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమాను కొన్న పీపుల్స్ మీడియా సంస్థ ఏరియాల వారిగా థియేట్రికల్ రైట్స్‌ను అమ్మడం ఇప్పటికే ప్రారంభించింది. నైజాం రైట్స్‌ దిల్ రాజు కాకుండా మైత్రీ మూవీస్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. సుమారు రూ. 60 కోట్లకు నైజాం ఏరియా రైట్స్‌ను మైత్రీ మూవీస్‌కు పీపుల్స్ మీడియా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

(ఇదీ చదవండి: అప్పుడు లడ్డూలా ఉండేదాన్ని: ప్రముఖ నటి)

Advertisement
 
Advertisement
Advertisement