Pooja Hegde: బుట్టబొమ్మ డ్యాన్స్‌ ప్రాక్టీస్‌

Pooja Hegde Practice Dance For Beast Movie - Sakshi

వన్‌.. టు.. త్రీ అంటూ హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ మధ్య డ్యాన్స్‌ స్టెప్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేశారు. ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్‌ చేశారు. ఇంతకీ ఈ బ్యూటీ ఇంతగా ఎందుకు డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేశారంటే.. 'బీస్ట్‌' సినిమా కోసం. తమిళ హీరో విజయ్‌ సరసన పూజా హెగ్డే నటిస్తున్న చిత్రమిది. గురువారం ఈ సినిమా షూటింగ్‌ చెన్నైలో ఆరంభమైంది.

విజయ్‌, పూజా పాల్గొనగా ఒక డ్యుయెట్‌ సాంగ్‌ చిత్రీకరణ ప్లాన్‌ చేశారు. ఈ పాట కోసం భారీ సెట్‌ను కూడా తయారు చేయించారు. ఈ పాట కోసమే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేశారు పూజా. ఈ పాట చిత్రీకరణ పూర్తి కాగానే హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవుతారట. ఇక్కడికొచ్చాక ప్రభాస్‌ సరసన చేస్తున్న రాధేశ్యామ్‌ షూట్‌లో పాల్గొంటారని సమాచారం.

చదవండి: రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ సీన్‌ లీక్‌, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top