రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ సీన్‌ లీక్‌, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి! | Radhe Shyam Movie Climax Scene Leaked | Sakshi
Sakshi News home page

రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ సీన్‌ లీక్‌, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి!

Jun 30 2021 8:38 PM | Updated on Jun 30 2021 9:17 PM

Radhe Shyam Movie Climax Scene Leaked - Sakshi

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’..  విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్, ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. కాగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బ్రిక్స్‌ ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటున్న రాధే శ్యామ్‌ చివరి దశకు చేరుకుంది.

ఇక విడుదలకు సిద్దమవుతున్న ఈ మూవీ నుంచి అసక్తికరమైన అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఈ మూవీ యూనిట్‌ సన్నిహిత వర్గాలు తాజాగా క్లైమాక్స్‌ సీన్‌ను లీక్‌ చేశారు. ఈ మూవీ చివరలో కన్నీరు పెట్టించే ఎమోషనల్‌ సీన్‌ ఉంటుందని, ప్రభాస్‌, పూజా హెగ్దెల మధ్య సాగే ఈ సన్నివేశం బాధిస్తుందని వెల్లడించారు. ఇందులో ప్రేరణ చివరిలో చనిపోతుందని, దీంతో విక్రమాదిత్య బోరున విలపించే ఈ సన్నివేశం భావోద్వేగానికి గురిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ లైన్‌ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. 

ఇటలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడిక్‌ ప్రేమకథగా రానున్న ఈ మూవీలో కృష్ణం రాజు ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయనతో పాటు ప్రియదర్శి, భాగ్యశ్రీ, సచిన్‌ కేడ్కర్‌, మురళి శర్మ, కునాల్‌ రాయ్‌ కపూర్‌, సాహా ఛేత్రి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువీ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణామూవీస్‌, యువీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపిస్తే.. పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్‌ పాత్రలో కనిపించనుంది. జూలై 30న రాధే శ్యామ్‌ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement