యంగ్ హీరోతో జతకట్టనున్న పొన్నియిన్ సెల్వన్ భామ! | Sakshi
Sakshi News home page

Aishwarya Lekshmi: ముక్కోణపు ప్రేమకథా చిత్రం..హీరోయిన్‌గా పొన్నియిన్ సెల్వన్ భామ!

Published Thu, Feb 8 2024 3:01 PM

Ponniyin Selvan Heroine Acts With Young Hero In Kollywood Movie - Sakshi

వైవిధ్య భరిత కథా పాత్రలను ఎంపిక చేసుకుంటూ సక్సెస్‌ఫుల్‌ బాటలో పయనిస్తున్న యంగ్ హీరో అశోక్‌సెల్వన్‌. ఇటీవల ఈయన నటించిన పోర్‌ తొళిల్‌, బ్లూస్టార్‌ వంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించాయి. తాజాగా అశోక్‌సెల్వన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పొన్ను ఒన్ను కండేన్‌. వి. ప్రియ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముక్కోణపు ప్రేమకథా చిత్రంగా ఉంటుందని సమాచారం. 

ఇందులో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రం ఫేమ్‌ ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటిస్తున్నారు. వసంత రవి మరో ముఖ్యపాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. పొన్ను ఒన్ను కండేన్‌ చిత్రం యువతను ఆకట్టుకునే పలు ఆసక్తికరమైన అంశాలతో ఉంటుందని సమాచారం. అశోక్‌సెల్వన్‌ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిసింది. నటిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఐశ్వర్య లక్ష్మి చిన్న గ్యాప్‌ తరువాత ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఆమె పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement