20 మంది రిటైర్డ్‌ ఆటగాళ్లతో సినిమా.. | Polama Oorgolam Tamil Film Starring With 20 Football Players | Sakshi
Sakshi News home page

Polama Oorgolam Movie: 20 మంది రిటైర్డ్‌ ఆటగాళ్లతో సినిమా..

Apr 10 2022 9:35 PM | Updated on Apr 10 2022 9:36 PM

Polama Oorgolam Tamil Film Starring With 20 Football Players - Sakshi

చెన్నై సినిమా: క్రీడల నేపథ్యంలో ఇంతకుముందు చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా 20 మంది విశ్రాంతి ఫుట్‌బాల్‌ క్రీడాకారులతో రూపొందుతున్న చిత్రం 'పోలామా ఊర్‌ కోలం'. గజ సింహ మేకర్స్‌ పతాకంపై ప్రభుజిత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగరాజ్‌ బాయ్‌ దురైలింగం దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు దర్శకుడు కళాప్రభు, విఘ్నేష్‌ శివన్, హెచ్‌. వినోద్‌ వద్ద సహ దర్శకుడిగా పని చేశారు.

ప్రభుజిత్, మధుసూదన్‌ కథానాయకులుగా నటిస్తున్న ఇందులో శక్తి మహేంద్ర నాయకిగా పరిచయమవుతున్నారు. వీరితో పాటు 1980లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ క్రీడల్లో పాల్గొని ప్రఖ్యాతిగాంచిన 20 మంది క్రీడాకారులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారని దర్శకుడు తెలిపారు. వారి చుట్టూనే ఈ చిత్ర కథ తిరుగుతుందని, ఉత్తర చెన్నైలో జరిగిన యదార్థ ఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్రం షూటింగ్‌ను 80 శాతం ఆంధ్రలోనూ, 20 శాతం తమిళనాడులోనూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement